Home తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల మెరుపు ముట్టడి

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల మెరుపు ముట్టడి

253
0

హైదరాబాద్
నాంపల్లి లో బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల మెరుపు ముట్టడి నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తోపాటు ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషేర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ మెట్టు సాయి, నాయకులు హర్కర వేణు గోపాల్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, తదితరులు ముట్టడిలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ అరెస్ట్, యూపీ లో యోగి ఆదిత్య అరాచక పాలన పై మహేష్ కుమార్ విరుచుకపడ్డారు. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు  కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలను పోలీసులు  అడ్డుకుని అరెస్టు చేసార. తరువాత వారిని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలింపచారు.

Previous articleటిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌ – ఈవో చేతుల‌మీదుగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించిన ఐఎస్ఓ బృందం
Next articleవైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా కు లక్షకుపైగా గా ఓట్ల మెజార్టీ తేవాలి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here