గూడూరు
నెల్లూరు జిల్లాలో గుట్కా లపై వస్తున్న వరుస కధనాలకు జిల్లా ఎస్పీ విజయరావు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ల పరిధిలో పోలీసులు నిషేధిత గుట్కా స్థావరాలపై ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వ హించారు.అందులో భాగంగానే గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో పట్టణ సీఐ నాగేశ్వరమ్మ,పట్టణ పోలీసులు గూడూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ఉన్న ఓ దుకాణంలో తనిఖీలు చేపట్టగా ఆ దుకాణంలో నిషేధిత హన్స్,గుట్కాలున్నట్లు గుర్తించి సుమారు 1500 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మకపు దారుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకుగూడూరు పట్టణంలో నిహోల్ సేల్ దుకాణాలు, నిత్యావసర దుకాణాలు, కిళ్లీ షాపులు తదితర అనుమానిత ప్రదేశాల్లో దాడులు చేసి 1500 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.గుట్కా లు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ గుట్కా స్థావరాలపై మెరుపు దాడులు… -గూడూరులో 1500 ప్యాకెట్లు స్వాధీనం….అమ్మకపు దారులు పై కేసు నమోదు...