చిత్తూరు
నారా లోకేష్ రౌడీలాగా మాట్లాడుతున్నారని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు ఏనాడూ కుప్పం అభివృద్ధిని పట్టించుకోలేదని.. కోవిడ్ సమయంలోను ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు.కనీసం తాగునీరు సదుపాయం కూడా అందించలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. కుప్పం నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని ఎమ్మెల్యే రోజా కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ జగన్ రాకపోయినా వైసీపీని గెలిపిస్తున్నారని, ఆయనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని రోజా నిప్పులు చెరిగారు.