విశాఖపట్నం
విశాఖ జిల్లా నర్సీపట్నం – తుని రహదారిలో నాతవరం మండలం , గాంధీ నగరం వద్ద భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహానాన్ని నడిపాడు. అదుపుతప్పిన లారీ గాంధీ నగరం వద్ద రోడ్డును ఆనుకొని ఉన్న కల్వర్ట్ గోడ ఎక్కి పక్కకు పడిపోయింది. లారీలో సరుగుడు దుంగలున్నాయి. ఘటనలో లారీ సగం వరకు ఛిద్రం అయింది. అదృష్టవశాత్తై డ్రైవర్, క్లీనర్ క్షేమం గా బయటపడ్డారు..