మద్దికేర
మద్దికెర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో అతివేగంతో వెళ్తున్న టిప్పర్ సైకిల్ పై వెళ్తున్న బాలుడిని ఢీ కొనడంతో బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళగా సోమవారం రోజున ఉదయం 11: 45 గంటల సమయంలో పెరవలి నుంచి మద్దికేర పోవుదారిలో ఈద్గా దగ్గరలో కే. ఏ 34 బి 6568 నంబర్ గల టిప్పర్ డ్రైవర్ అయిన రమేష్ కుమార్ (ఉత్తరప్రదేశ్ రాష్ట్రం) అను అతను సైకిల్ మీద వస్తున్న పెరవలి గ్రామానికి చెందిన కూరువ రంగస్వామి 13 సంవత్సరాల వయస్సు గల బాలుడికి టిప్పర్ ను అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న డ్రైవర్ సైకిల్ ను తగిలించగ సైకిల్ పైన ఉన్న బాలుడు తీవ్రగాయాలు పాలై పత్తికొండ ఆసుపత్రి కి తరలించగా గాయాలతో కోలుకోలేక బాలుడు మృతిచెందినట్లు పిర్యాదు రాగ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు మద్దికేర ఎస్.ఐ మమత తెలియజేశారు.