Home తెలంగాణ లారీ బోల్తా…డ్రైవర్ కు గాయాలు

లారీ బోల్తా…డ్రైవర్ కు గాయాలు

104
0

యాదాద్రి భువనగిరి
ప్రమాదాలకు తావిస్తున్న మూల మలుపు అది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామం జైతీరాం తండా సమీపంలో ఉన్న, మూలమలుపు వద్ద కాలువలో లారీబోల్తా పడింది.  మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో గజ్వేల్ నుంచి భువనగిరి వైపు  లారీ కంటైనర్ లో( సిమెంట్ & ఫర్టిలైజర్ లతో) వినియోగించే జిప్సం రా మెటీరియల్ లోడుతో వెళుతోంది.  ముల్కలపల్లి జైతీరామ్ తండా సమీపంలో మూలమలుపు వద్ద  పక్కన కాలువలో  బోల్తాపడింది.  లారీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లోడుతో ఉన్న లారీ మెటీరియల్ టైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రైవర్ క్లీనర్ కు గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. నిత్యం ఈ దారి వెంట నడిచే చోట అనేక లారీ ప్రమాదాలు జరిగాయని, మూలమలుపు వద్ద ప్రమాదాలు జరగకుండా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు పలువురు కోరుతున్నారు

Previous articleకల్నల్ సంతోష్ బాబు కు మహావీర్ చక్ర
Next articleశ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here