Home తెలంగాణ నష్టపోయాం..న్యాయం చేయండి నకిలీ దాన విక్రేత పై చర్యలకు అదేశించండి...

నష్టపోయాం..న్యాయం చేయండి నకిలీ దాన విక్రేత పై చర్యలకు అదేశించండి ప్రజావాణిలో కలెక్టర్ ను కోరిన కోళ్ల రైతులు

97
0

జగిత్యాల, అక్టోబర్ 11
నకిలీ కోళ్ల దాణా విక్రయించి వేల కోళ్ల మృతికి కారణమై కోటి రూపాయలు పైగా  నష్ట పోయామని మోసం చేసిన శ్రీనివాస్ పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని కోళ్ల రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. అనంతరం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ప్రకటన విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల కోళ్ల వ్యాపారులకు కథలపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ గతములో నాణ్యమైన కంపెనీల కోళ్ల దాణాను సప్లయ్ చేసే వారన్నారు. ఇదే శ్రీనివాస్ నకిలీ కోళ్ల దాణాను బాలాజీ పౌట్రీస్ పేరుతో తయారుచేసి జిల్లా లోని 25 మంది కోళ్ల రైతులకు సరఫరా చేశాడని తెలిపారు. నాణ్యతలేని ఈ దాణా తిన్న దాదాపు 80 వేల కోళ్లు చనిపోగా కోళ్ల రైతులు ఒక కోటి 10 లక్షల వరకు నష్టపోయినట్లు వాపోయారు. వెల్గటూర్ మండలంలోని జగదేవుపేటకు చెందిన అంజయ్య అనే కోళ్ల రైతు గత నెల 19న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఊరుకున్నారని ఎటువంటి చర్యలకు పోవడంలేదని వాపోయారు. మిగతా కోళ్ల రైతులు కోరుట్ల, రాయికల్, కథలాపూర్, మెట్ పెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులను తీసుకోవడం లేదని అన్నారు. గత నెల 27 న ప్రజావాణిలో దరఖాస్తు చేశామని మా బాధను అర్థం చేసుకొని తిరిగి ప్రజావాణిలో ఇస్తున్న ఈ దరఖాస్తు ను గుర్తించి కోళ్ల రైతులకు తీవ్ర నష్టం చేసిన అంబాల శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖను ఆదేశించాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కోళ్ల రైతులు సింగం అంజయ్య, అనీల్ రెడ్డి, మల్లేశం, జలందర్, నరేష్, శేఖర్, హైమద్, గణేష్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, ప్రశాంత్ రావ్, కొల రాజు, పాపయ్య, రంగారావు, రఘు తోపాటు పలువురు ఉన్నారు.

Previous articleఓటరు జాబితా ఆదారంగా జిల్లా ప్రజలందరికీ 100% వ్యాక్సిన్ అందించాలి జిల్లా కలెక్టర్ జి. రవి
Next articleమహిళను కాపాడిన పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here