శ్రీకాళహస్తి
ఆయనో పోలీస్ కానిస్టేబుల్. ఇప్పటికే ఆయనకు పెళ్ళయింది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా వలంటిరుగా పని చేసే ఓ యువతిని తన మాయ మాటల తో ప్రేమ లో దించాడు ఆ యువతిని వంచనకు గురి చేశాడు. ఈ విషయం ఇరు కుటుంబాల కు తేలియడం తో వివాదమైంది. పంచాయితీ పేరుతో పిలిపించి… యువతి కళ్ల ముందే ఆమె తండ్రి ని చితక బాదాడు. ఈ అవమానం భరించ లేక యువతి ఉరి వేసుకుని ఆత్మ హత్య కు పాల్పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లో గురువారం చోటు చేసుకుంది.భాదితుల కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ కైలాసనగర్ కు సాంబశివరావు, నాగిణి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి (21) పురుపాలక సంఘo పరిధిలో 9 వార్డు వలంటిరు గా విధేలు నిర్వహించేది. వీరిది చాల నిరుపేద కుటుంబం. సాంబశివరావు పేయింటరు గా పని చేస్తుంటాడు. ప్రస్తుతం ఉమామహేశ్వరి సంపాదన తోనే వీరి కుటుంబం నడుస్తోంది.
.శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే ప్రసాద్ కూడ దక్షిణ కైలాస నగర్ లో ఉమామహేశ్వరి కుటుంబం ఉండే ప్రాంతం లోనే నివాసం టున్నాడు. ఈ నేపద్యంలో వీరిద్దరి మద్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమ గా మారింది. ఉమామహేశ్వరిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన ప్రసాద్ తరువాత యువతి ని వంచనకు గురి చేశాడు. ఈ విషయం ఇరు కుటుంబాల కు తేలియడం తో వివాదమైంది. ఈ నేపద్యంలో ప్రసాద్ కుటుంబ సబ్యులు ఇటీవల ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల తో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం తీర్చడానికి బుధవారం పట్టణంలో పంచాయతీ నిర్వహిద్దామని ఉమామహేశ్వరి కుటుంబ సబ్యుల కు ప్రసాద్ తెలిపాడు. దీంతో ఉమామహేశ్వరికుటుంబ సభ్యులు లో బావి వద్ద కు వెళ్ళారు. అక్కడ పంచాయతీ నిర్వహించారు. ప్రేమ పేరు తో తనను మోసం చేసినందుకు పెళ్ళి చేసుకోవాలని ఉమామహేశ్వరి పట్టు పట్టింది. అయితే ప్రసాద్ అందుకు అంగీకరించలేదు. ఈ సందర్బంగా ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. యువతి తండ్రి సాంబశివరావు పై ప్రసాద్ చేయి చేసుకున్నాడు. దీంతో ఉమామహేశ్వరి తీవ్ర మనస్తాపా నికి గురైంది. తన వలన తండ్రి కి అవమానం జరిగిందని వేదన చెందింది. పంచాయతీ అర్దంతరం గా ముగించుకుని ..వారందరు ఇంటికి వచ్చేశారు. తనకు జరిగిన అవమానం, మోసం తలచుకుని మానసిక వేదన కు గురైన ఉమామహేశ్వరి తన బుదవారం రాత్రి తన ఇంటి లో అందరూ నిద్రOచిన తరువాత ఉరి వేసుకుని ఆత్మ హత్య కు పాల్పడింది. ఈ సంఘటన పై ఉమా మహేశ్వరి తండ్రి సాంబశివరావు పోలీసుల కు పిర్యాదు చేశారు. ఆయన పిర్యాదు మేరకు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి కి తరలించారు