Home తెలంగాణ నిమ్స్ లో తొలిసారి ఊపిరితిత్తుల అవ‌య‌వ మార్పిడి

నిమ్స్ లో తొలిసారి ఊపిరితిత్తుల అవ‌య‌వ మార్పిడి

270
0

హైదరాబాద్ డిసెంబర్ 1
నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌ లో తొలిసారి ఊపిరితిత్తుల అవ‌య‌వ మార్పిడి శ‌స్త్ర‌చికిత్సను బుధ‌వారం విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. బ్రెయిన్ డెడ్‌తో చ‌నిపోయిన 47 ఏండ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళ‌ ఊపిరితిత్తుల‌ను మాదాపూర్ మెడికోవ‌ర్ ఆస్ప‌త్రి నుంచి పంజాగుట్ట‌లోని నిమ్స్‌కు గ్రీన్ చానెల్ ద్వారా త‌ర‌లించారు.విడ్‌తో బాధ‌ప‌డుతున్న 19 ఏండ్ల బాలిక‌కు బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి ఊపిరితిత్తుల‌ను అమ‌ర్చారు. సికింద్రాబాద్ తాడ్‌బంద్‌కు చెందిన సుశీలా(47) న‌వంబ‌ర్ 27వ తేదీన బోయిన్‌ప‌ల్లి మెయిన్ రోడ్డు క్రాసింగ్ వ‌ద్ద‌ బైక్‌పై నుంచి కింద‌ప‌డి కోమాలోకి వెళ్లింది. అనంత‌రం ఆమెను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం మేడికోవ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. అయిన‌ప్ప‌టికీ ఆమె ఆరోగ్యం మెరుగ‌ప‌డ‌లేదు. ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. కొవిడ్‌తో బాధ‌ప‌డుతున్న 19 ఏండ్ల యువ‌తికి సుశీలా ఊపిరితిత్తుల‌ను అమ‌ర్చారు.

Previous articleపోలీసులపై అసత్యపు ఆరోపణలు చేయొద్దు సీఐ జగదీష్ , ఎస్ఐ
Next articleఆర్టీసీ ఛార్జీల పెంపును ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి : బాజిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here