ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఎమ్మిగనూరు బాగ్ కన్వీనర్ చిన్న బాబు ఆధ్వర్యంలోమాచాని సోమప్ప హై స్కూలు మేనేజ్మెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చిన్న బాబు మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాల మరియు స్కూల్లో విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీ వో 42పై ఏబీవీపీ ఆందోళనలు ఫలితంగా ఎయిడెడ్ కు సంబంధించి 4వ ఆప్షన్ అయిన మునపటి ఎయిడెడ్ స్కూల్ గానే కొనసాగవచ్చు అన్న ఆప్షన్ను మీరు ఎంచుకొని ప్రభుత్వానికి సమ్మతి తెలుపుతూ లేఖ పంపవలసిందిగా కోరారు. అలాగే మన స్కూలు పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు అండగా మీ ఆశయాలను కొనసాగించవలసిందిగా కోరుతున్నామన్నారు అలాగే జీ వో నెంబర్ 35 ను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.