రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయములోబుధవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పొలిస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వాల్మీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి సప్తబుషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకి మారి అధ్బుతమైన రామాయణం గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ స్మరించుకోవాల్సిన అవసరం వుంది. అదర్శవంతమైన జీవితం గడపడటంతో పాటు సమాజ శ్రేయస్సు కు అవసరమైన జీవన సూత్రాలను రామాణం ద్వారా వాల్మీకీ భోధించారని ఎస్పీ తెలిపారు