హైదరాబాద్ అక్టోబర్ 2
మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా గాంధీభవన్ లో గాంధీ, శాస్త్రి గార్ల చిత్ర పటాలకు ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, నాయకులు బోసు రాజు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్షయ్య, కుమార్ రావ్, నిరంజన్, హర్కర వేణుగోపాల్ తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రపంచానికే శాంతి సిద్ధాంతాన్ని పరిచయం చేసారు. నేడు ప్రపంచం గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తుందన్నారు.నాడు గాంధీ, శాస్ట్రీ సిద్ధాంతాలను నేటి పాలకులు తుంగలో తొక్కుతున్నారు.ఎన్నో వ్యయ ప్రయసాలకు ఓర్చి దేశాన్ని అన్ని రంగాల్లో అబ్దుతంగా నిర్మిస్తే నేడు బీజేపీ దేశాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు.మేము ఇద్దరం, మాకు ఇద్దరు అన్నట్టు మోడీ అమిష్ షాలు దేశంలో అన్ని రంగాలను వారి అనుకూల వ్యాపారులకు దేశంలోని అన్ని రంగాలను అమ్ముకుంటున్నారు.చివరకు డిఫెన్స్ లో కూడా వాటాలను అమ్మకం పెట్టారంటే ఈ బీజేపీ పాలకులకు దేశ భద్రత పట్ల ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థం అవుతుంది.ఈ దేశం భద్రతగా, సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో గులాబీ చీడ పీడిస్తుంది. విద్యార్థుల, యువకుల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణలో అన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయి.సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో అమర్ వీరుల, ఉద్యమ కారుల ఆశయాలు సాధించే వరకు పోరాటం చేస్తాం..ఎల్బీ నగర్ లో మా నాయకులను అరెస్ట్ చేశారు. వెంటనే విడుదల చేయాలి.శాంతియుత కార్యక్రమానికి సహకరించాలి.