బేతంచెర్ల
బేతంచర్ల పట్టణంలోని “హెల్ప్” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బేతంచెర్ల జర్నలిస్టు సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, సమాచార హక్కు చట్టం సభ్యుడు డి.ఎల్. ఎన్ శాస్త్రి మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మహాత్మా గాంధీజీ భారతదేశాన్ని విదేశీ యుల నుండి రక్షించి స్వతంత్రాన్ని అహింస మార్గమతో తెచ్చి పెట్టిన మహా నాయకుడు అని ఆయనను కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోపం, ఆవేశాలతో కాకుండా శాంతి మార్గం లోనే నడిచి భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపాలని వారు ఈ సందర్భంగా యువతకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గూటం భగవాన్, పి. ఎండి. భాష, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నూర్ అహ్మద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జయంతి గౌడ్, కోశాధికారి అహ్మద్ సభ్యులు డాక్టర్ భాష, హనుమంత రెడ్డి , జర్నలిస్ట్ మద్దిలేటి, రమణారెడ్డి, మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.