కోరుట్ల సెప్టెంబర్ 25
ఈనెల 27 న భారత్ బందు ను విజయవంతం చేయండని అఖిలపక్ష నేతలు కోరారు.శనివారం కోరుట్ల పట్టణంలోని
సినారె కళాభవన్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ వ్యవసాయ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీకి చేరుకుని గత పది నెలలుగా వాననక చలిని సైతం లెక్కచేయకుండా కరోనా మహమ్మారికి భయపడకుండా రైతులు ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం సిగ్గుచేటని అన్నారు. అలాగే కరోనా మహమ్మారి మూలంగా కర్ఫ్యూలు కఠిన ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా 80 శాతం మంది ప్రజల ఆదాయ మార్గాలు తగ్గిపోయాయిని , వ్యాపారాలు మూతపడుతున్నాయి ,పలు విద్యా సంస్థలు సైతం మూతపడుతున్నాయి దీంతో జనాలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకీడుస్తున్నారు. ఒకవైపు ఉపాధి కరువై సామాన్యుడు దిగజారుతూ ఉంటే పెట్రో బాదుడు సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. ప్రతిరోజు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని ఇంధన ధరల పెరుగుదల మూలంగా పరోక్షంగా నిత్యావసర ధరలతో సహా పలు వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి గత ఐదు నెలల క్రితం మొదలైన బాదుడు ఇప్పటికీ కొనసాగుతోంది పెట్రోల్ ధర దేశవ్యాప్తంగా సెంచరీ దాటిపోయింది కరోనా కాటేసిన ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కనుకరించాల్సిన ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై పన్నుల పేరుతో బాదుతున్నారని , సాధారణంగా డిమాండ్ తగ్గినప్పుడు దర తగ్గుతూ ఉండాలని
మరి దేశవ్యాప్తంగా లాక్డౌన్లు కర్ఫ్యూల దెబ్బకు పెట్రోలు డీజిల్ వాడకం చాలా వరకు తగ్గిందని అలాంటప్పుడు ధరలు తగ్గాలి కానీ ధరలు పెరుగుతూనే ఉన్నాయిని , పెట్రోల్ డీజిల్ ను జిఎస్టి పరిధిలోకి తెస్తామని ప్రకటించిన కేంద్రం రాష్ట్రాలు ఒప్పుకోకపోవచ్చు అని నంగనాచి కబుర్లు చెప్పటం విడ్డూరంగా ఉందని
అఖిలపక్ష నాయకులు ఎద్దేవా చేశారు .అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులను మరియు బస్సు చార్జీలను పెంచే యోచనలో ఉన్నదని తెలిసి బ్రతకాలంటేనే భయమేస్తుంది ఇప్పటికే రాజధాని నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన భూములను అమ్మి భావితరాలకు నిలువ నీడ లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కొనసాగుతున్న పలు సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి నియంతలా వ్యవహరిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు ఆపాలని కార్మికులకు నష్టం కలిగించే కార్మిక కోడ్ల ను రద్దు చేయాలని విద్యుత్ సవరణ చట్టం 2020 ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27 వ తేదీన అఖిల పక్షాల తరపున భారత దేశ వ్యాప్తంగా బందుకు పిలుపునివ్వడం జరిగింది ఇట్టి భారత్ బంద్ కు వ్యాపారులు చేనేత కార్మికులు పలు వాణిజ్య సంస్థల వారు విద్యా సంస్థల వారు కార్మికులు కర్షకులు చిరు వ్యాపారులు వీరు వారు అని తేడా లేకుండా అందరూ ఏకతాటి పైకి వచ్చి బందును విజయవంతం చేయగలరని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు ఈకార్యక్రమంలో కొరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు తిరుమల గంగాధర్, తెలంగాణ జన సమితి కోరుట్ల నియెజకవర్గ ఇంచార్జ్ కంతి మెుహన్ రెడ్డి, ఉభయ కమ్యునిస్టు నాయకులు చెన్న విశ్వనాథం, సుతారి రాములు, చింత భుమేశ్వర్, తిరుపతి నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షులు యంఎ నయిం, మాజీ కౌన్సిలర్ సోగ్రాబి, యువజన కాంగ్రెస్ కొరుట్ల నియెజకవర్గ అద్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి ,పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహయ కార్యదర్శి ఎంబెరి సత్యనారయణ ,కిసాన్ సెల్ జిల్లా ప్రదాన కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా ఉపాద్యక్షులు శశేంధర్ ,కిసాస్ సెల్ పట్టణ అద్యక్షులు శ్రీరాముల అమర్, యంఎ కలీం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాతర్ల విజయ్, పొతాని సత్తయ్య ,తెలంగాణ జన సమితి నాయకులు అజహర్ ఉద్దిన్ ,ఎస్ అశోక్, చిట్యాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.