శ్రీశైల దేవస్థానం
బుధవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం లో ఈరోజు హుండి లెక్కింపు జరిగింది. దేవస్థానానికి రూ.3,56,20,325/-లు నగదు రాబడి లభించింది. 1435 యు.ఎస్.ఎ. డాలర్లు, 70 కెనడా డాలర్లు, 10 యూరోస్, 2 సింగపూర్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులోపాల్గొన్నారు.