Home రాజకీయాలు అక్టోబరు 7 న మమతా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

అక్టోబరు 7 న మమతా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

89
0

కోల్‌కతా అక్టోబర్ 5
భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ మేరకు  తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు లేఖ రాశారు.   ఎన్నికల కమిషన్‌ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. ప్రియాంక టిబ్రేవాల్‌కు 26,428 ఓట్లు సాధించింది..పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే భవానీపూర్‌ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబరు 3న విడుదలైన  భవానీపూర్‌, జంగీపూర్‌, షంషేగంజ్‌ ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉత్తర ప్రదేశ్‌ లఖీంపూర్‌ఖేరీ ఘటనను టీఎంసీ ఖండించింది.

Previous articleరోడ్డు ఆక్రమించుకున్న వ్యాపారులు దుకాణాలను స్వచ్చందంగా తొలగించుకోవాలి
Next articleడెత్‌ సర్టిఫికెట్‌లో పొందుపరచలేదనే కారణంతో పరిహారం నిరాకరించరాదు రాష్ట్రాలకు మరింత స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here