మెదక్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయి ఢీకొని నర్సింహ్మ రెడ్డి(50) మృతి చెందాడు. మృతుడు బతుకుదెరువు కోసం వలస వచ్చిగత కొన్ని సంవత్సరాలుగా కాళ్ళకల్ గ్రామంలో నివాసం వుంటున్నాడు. స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం ఉదయం నర్సింహ్మ రెడ్డి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది