విజయవాడ
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు ఎస్సై హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఎస్సై మాట్లాడుతూ మృతుని వివరాల ప్రకారం మృతునిది విజయవాడ వాంబే కాలనీకి చెందిన శేఖర్ (ఎలక్ర్టిషియన్) అనే వ్యక్తి పని నిమిత్తం ఖమ్మం వెళ్ళి వస్తుండగా ఘటన చోటుచేసుకుందని తెలిపారు. పూర్తి వివరాలు విచారణానంతరం తెలియపరుస్తామని ఎస్సై హరిప్రసాద్ అన్నారు…