జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల ఆగస్టు 21
జాతీయ స్పూర్తితో ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమంలో అందరు పాల్గోనాలని జిల్లా కలెక్టర్ జి.రవి పిలుపునిచ్చారు. శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక స్వామి వివేకానంద మినిస్టేడియం నుండి నిర్వహిస్తున్న ఫీట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
12 మార్చి, నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. 75 వారాల పాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని , తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 13,2021 నుంచి అక్టోబర్ 2,2021 వరకు ఫిట్ ఇండియా ప్రీడం రన్ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వీటిని పకడ్బందిగా జరుపాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నెహ్రు యువ కేంద్ర, జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మిని స్టేడియం నుండి సర్థార్ వల్లాభాయి పటేల్ స్టేడియం వరకు వెళ్లి తిరిగి మినిస్టేడియం వచ్చే విధంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ఏర్పాటు చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవా’లను ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ప్రజలందరిని శారీరకంగా దృడం చేయడమే లక్ష్యంగా ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమం చేపట్టామని, ప్రతి మనిషి ప్రతి రోజు కనీసం అరగంట సమయం వ్యాయమం చేయాలని, దీని వల్ల శారిరకంగా దృడంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. మనిషి శారిరకంగా దృడంగా ఉంటే వ్యాధుల బారినపడే అవకాశం తగ్గుతుందని, ప్రస్తుత కరోనా పరిస్థితులో అందరు తప్పనిసరిగా వ్యక్తిగత ఫిటనెస్ పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో విద్యావంతులు, విద్యార్థులు ఫిటనెస్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, అందరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ప్రతి రోజు కొంత సమయం వ్యాయమం చేయడం వల్ల శారిరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కల్గుతుందని, ఒబెసిటి, నీరసత్వం , సోమరితనం దూరం అవుతాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞను కలెక్టర్ అందరితో చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సురేష్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధురీ, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్,టి.ఎన్.జి.ఓ.అధ్యక్