Home ఆంధ్రప్రదేశ్ మంగళవారం నుంచి మావోయిస్టు ఆవిర్భావవారోత్సవాలు ఆడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు

మంగళవారం నుంచి మావోయిస్టు ఆవిర్భావవారోత్సవాలు ఆడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలు

244
0

విశాఖపట్నం
మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నంఉచి  ప్రారంభం అయ్యాయి. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో  ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడవుల్లో గాలింపు చేట్టాయి. ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్ కావడం తదితర సంఘటనలతోపాటు ఏవోబీలో రెండు సార్లు ఎదురుకాల్పులు జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  గూడెం కొత్త వీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. మరోవైపు, ప్రభుత్వ ఆస్తుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు.

Previous articleప్రతినెలా పెన్షన్ సాకాలంలో వచ్చేలా చూడండి ప్రజావాణిలో కోరిన దివ్యాంగుల నాయకులు
Next articleఎస్ ఒరిజినల్స్, ఆర్‌కే సినీ టాకీస్ ‘మధుర వైన్స్’ సినిమా నుంచి వెన్నెల క‌న్నెల రేయి సాంగ్ కి సూప‌ర్ రెస్పాన్స్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here