హైదరాబాద్
మావోయిస్టు ఆగ్రనేత, గురువారం మృతి చెందిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రిమల ఫోటోలను మావోయిస్టు పార్టీ శనివారం విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసారు. ఈ అంత్యక్రియలకు మావోయిస్టులు భారీగా హాజరైయారు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టు నివాళులు అర్పించారు