ములుగు
ప్రశాంతంగా ఉన్న ములుగు అడవుల్లో విధ్వంసం సృష్టించాలని ఉద్దేశంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో సిపిఐ మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ములుగు ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. ములుగు జిల్లా తాడువాయి కాల్వపల్లి అడవుల్లో పోలీసులను ప్రజా ప్రతినిధులు అమాయక ప్రజలను అంతమొందించేందుకు కుట్రపన్నిన మావోయిస్టు దళాలకు చెందిన పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సిపిఐ మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రన్న దామోదర్ ఆజాద్ నాయకత్వంలో విధ్వంసం సృష్టించడానికి పన్నాగం పన్నారని ఎస్పీ తెలిపారు మావోయిస్టు పార్టీ మాటలకు యువత ఆకర్షితులు కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి శోభన్ కుమార్ ఏ ఎస్ పి సాయి చైతన్య సిఆర్పిఎఫ్ సివిల్ పోలీసులు పాల్గొన్నారు