Home క్రీడలు మార్చి 5 నుంచి 3బీఎల్‌ బాస్కెట్‌ బాల్‌ సీజన్‌ పోటీలు

మార్చి 5 నుంచి 3బీఎల్‌ బాస్కెట్‌ బాల్‌ సీజన్‌ పోటీలు

325
0

చండీఘడ్‌ డిసెంబర్‌ 17
బాస్కెట్‌ బాల్‌ ఫెడరేషన్‌  ఆఫ్‌ ఇండియ (బీఎఫ్‌ఐ) మరియు 3గీ3 ప్రో బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ (3బీఎల్‌)లు ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుని 3X3 ప్రొఫెషనల్‌ బాస్కెట్‌ బాల్‌ను భారతదేశంలో ప్రోత్సహిస్తున్నాయి. బాస్కెట్‌బాల్‌ను అమితంగా ప్రేమించే చండీఘడ్‌ నగరంలో మార్చి 5 నుంచి మార్చి 27వరకూ 3బీఎల్‌ సీజన్‌ పోటీలు జరుగనున్నట్లు బీఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్‌ చందర్‌ ముఖి, 3బీఎల్‌ కమిషనర్‌ రోహిత్‌ భక్షిలు తెలిపారు. ‘‘భారతదేశంలో 3X3 ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ను ప్రోత్సహించేందుకు 3బీఎల్‌కు ప్రత్యేక హక్కులను బీఎఫ్‌ఐ మంజూరు చేసింది. ఎంతోమంది బాస్కెట్‌బాల్‌ అథ్లెట్స్‌కు 3బీఎల్‌ అదనపు ఆదాయం అందించడంతో పాటుగా అదనపు ఎక్స్‌పోజర్‌ను సైతం అందించనుంది’’ అని శ్రీ శర్మ అన్నారు. ‘‘3బీఎల్‌ ఇప్పుడు ఫీడర్‌ వ్యవస్ధగా మన జాతీయటీమ్‌లకు తోడ్పడనుంది. మరీ ముఖ్యంగా  రాబోయే సంవత్సరంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 3X3 ఈవెంట్లలో పాల్గొంటున్న వారికి ఇది మరింతగా తోడ్పడనుంది’’ అని అన్నారు.‘‘భారతదేశంలో 3X3 ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక హక్కులను మంజూరుచేసిన బీఎఫ్‌ఐకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని శ్రీ భక్షి అన్నారు.  ‘‘3బీఎల్‌ ఇప్పుడు ఆటగాళ్లకు ఆదాయం అందించేందుకు విలువైన వనరుగా నిలబడేందుకు కట్టుబడి ఉంది. ఆట ఆడేందుకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటుగా అంతర్జాతీయ ప్రతిభావంతులతో పోటీపడే అవకాశమూ కల్పిస్తుంది. అదనంగా బీఎఫ్‌ఐ యొక్కజాతీయ గుర్తింపునూ అందిస్తుంది. 3బీఎల్‌ ను ప్రత్యేకంగా ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ (ఫిబా) గుర్తించింది. ఇది ఎంతోమంది భారతీయ బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లకు బహుళ వినూత్న ప్రయోజనాలనూ అందించనుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో  పంజాబ్‌కు చెందిన సీనియర్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ప్లేయర్లు అమ్‌జ్యోత్‌ సింగ్‌ గిల్‌, పల్‌ ప్రీత్‌ సింగ్‌ బ్రార్‌  మరియు మహిళా అంతర్జాతీయ ప్లేయర్‌ రస్‌ప్రీత్‌ సిధు పాల్గొన్నారు.

Previous articleనైపుణ్యం ఉంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌
Next articleర‌మ్నా కాళీ ఆల‌యాన్నితిరిగి ప్రారంభించిన భార‌త రాష్ట్ర‌ప‌తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here