విజయవాడ
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి న్యూ ‘బి’ కాలనీ లో వివాహిత మహిళ అనుమానస్పద రీతిలో మృతి చెందింది. మృతురాలు విజయలక్ష్మివి.టి.పి.ఎస్ .హాస్పిటల్ లో సీ.యల్ గా పనిచేస్తుంది. విజయలక్ష్మి మృతి చెందడంపట్ల ఆమె
బంధువులు అందోళనకు దిగారు. భర్త సురేష్ చంపి ఆత్మహత్య గా చిత్రీకరించడని వారు అరోనించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్నివిజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. భర్త సురేష్ మరో మహిళతో అక్రమ సంబంధం
పెట్టుకున్నడనే బంధువుల ఆరోపణ. గత కొద్ది కాలం గా భార్య, భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అందువల్లనే భార్యను హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించాడని బంధువులు ఆరోపించారు.