Home నగరం మాస్ మహారాజా ర‌వితేజ‌, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు `ఖిలాడి` టాకీ పార్ట్ పూర్తి

మాస్ మహారాజా ర‌వితేజ‌, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు `ఖిలాడి` టాకీ పార్ట్ పూర్తి

108
0

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`.  సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు: రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి

Previous articleశ్రీశైలమల్లన్న భక్తుడు గుండెపోటుతో ఆకస్మిక మరణం
Next article“లాంప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన యండమూరి వీరేంద్రనాథ్ నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ఏడుచేపలకథ చిత్ర నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన “లాంప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here