విజయవాడ
భవానిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గొల్లపూడి లో గుర్తుతెలియని దుండగులు 60 సంవత్సరాల వయస్సుగల వృద్దుడ్ని హతమార్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కార్యాలయం పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.