Home అంతర్జాతీయ వార్తలు తైవాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 46 మంది మృతి

తైవాన్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 46 మంది మృతి

77
0

తైవాన్ అక్టోబర్ 14
తైవాన్‌లో గురువారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. 13 అంత‌స్తుల నివాస స‌ముదాయంలో ఉద‌యం 3 గంట‌ల‌కు మంటలు చెల‌రేగాయి. ఈ అగ్నికీల‌ల్లో 46 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా, మ‌రో 55 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరిలో 14 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. నివాస స‌ముదాయంలో చెల‌రేగిన మంట‌ల‌ను అగ్నిమాప‌క సిబ్బంది అదుపు చేసింది.అయితే భ‌వ‌న శిథిలాల్లో చిక్కుక్కున్న వారి కోసం ఫైర్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. భ‌వ‌నంలోని కింది అంత‌స్తుల్లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్న‌ది. 40 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ భ‌వ‌నంలోని పైఅంత‌స్తుల్లో కుటుంబాలు బ‌స చేస్తుండ‌గా, కింది అంత‌స్తుల్లో దుకాణ స‌ముదాయాలు ఉన్నాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Previous articleఅక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం ” – గోశాల నిర్వ‌హ‌ణ -గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న – ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వెయ్యి మంది రైతుల‌కు శిక్ష‌ణ‌ – టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి
Next articleఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here