హుజూరాబాద్ అక్టోబర్ 30
హుజూరాబాద్ ఉపఎన్నికలో భారీగా పోలింగ్ నమోదవుతున్నది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు హుజూరాబాద్‌లో 45.05 శాతం ఓట్లు పోలవగా, వీణవంకలో 47.65 శాతం, జమ్మికుంటలో 45.36, ఇల్లందకుంటలో 42.09, కమలాపూర్‌లో 46.76 శాతం ఓట్లు పోలయ్యాయి.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. ఇల్లందకుంటలో మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఉదయం నుంచే భారీగా పోలింగ్ నమోదవుతున్నది. దీంతో ఉదయం 9 గంటవరకు 10.05 శాతం ఓట్లు నమోవదగా, 11 గంటలకు అది 33.27 శాతం ఓట్లు పోలయ్యాయి