హైదరాబాద్
నగరంలో నేపాల్ దంపతులు దొంగతనానికి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. పది లక్షల రూపాయల నగదు, 110 తులాల బంగారం ఎత్తుకెళ్లడం జరిగింది. గచ్చిబౌలి టేలికాం నగర్ లోని గోవిందరావు ఇంట్లో నేపాల్ కు చెందిన లక్ష్మణ్, పవిత్ర దంపతులు గత నాలుగు నెలలుగా వాచ్ మెన్ గా పని చేస్తున్నారు. ఇంటి యజమాని గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన లక్ష్మణ్ ఇంటి కిటికి తోలగించి లోపలికి ప్రవేశించి బేడ్ రుమ్ తలుపు పగులగొట్టి తాళం తిసుకోని గోద్రజ్ లాకర్ లోని నగదు బంగారంతో పరారయ్యాడు. .ఆదివారం మధ్యాహ్నం వాచ్ మెన్ ఫోన్ స్విచాఫ్ రావడంతో గోవింద్రావు కుటుంబం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో వాచ్ మెన్ కనపడటం లేదన్నారు. ఇంటి యజమాని గోవిందరావు మాట్లాడుతూ గతంలో నేపాల్ కు చెందిన మరో వ్యక్తి తన వద్ద నమ్మకంతో పని చేసేవాడని తను ఊరికి పోతూ లక్ష్మణ్ దంపతులు తమకు బంధువులు అవుతారని తను ఊరి నుంచి వచ్చే వరకు వారిని పనిలో పేట్టుకోవాలని చెప్పాడని అన్నారు. .తను నాలుగు నెలలు అయినా రాకపోవడంతో ఇతన్నే కొనసాగించానని అన్నారు. వీరు ఇలా చేస్తారని అనుకోలేదని వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.