నంద్యాల
నంద్యాల పట్టణంలో పట్ట పగలే దొంగలు బీభత్సం సృష్టించు తున్నారు. మరి పోలీసులకు సవాల్ విసురుతూ ఏదోక ప్రాంతాల్లో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాలంలో వరుస హత్యలతో వనికి పోతున్న పట్టణ వాసులకు దొంగల బెడదల తో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు అని పలువురు అంటున్నారు. బుధవారం నాడు కోట వీధికి చెందిన షేక్ మజీద్ అనే పాలీష్ కాంట్రాక్టర్ ఇంట్లో 35 తులాల బంగారు. 1.88 లక్షల నగదు చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మరియు దొంగల ముఠాను అరెస్టు చేయాలని పలువురు కోరుతున్నారు.