నెల్లూరు నవంబర్ 24
నెల్లూరు మునిసిపల్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ స్థానిక 41 వ డివిజన్ మనుమసిద్ధి నగర్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
ప్రజలకు అవసరమైన వసతి, సదుపాయాలు తాత్కాలిక ప్రాతిపదికన తక్షణమే పూర్తి చేసి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత 20 రోజులుగా ఎడతెరిపిలేని వానలతో వరదలతోను సామాన్య ప్రజల జీవన గమనం దుర్భర పరిస్థితిలో ఉందన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివాసాలు ఉంటున్న బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ సూచనలు సలహాలతో సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ విపత్కర పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. ప్రభుత్వం నుండి సహాయచర్యలు అందించేందుకు తగు చర్యలు చేపడతామన్నారు.