హైదరాబాద్ అక్టోబర్ 4
వారసత్వ కట్టడాలను పరిరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించిందని తెలిపారు. ఈ దేవాలయం ఏఎస్ఐ పరిధిలో ఉంది. పర్యాటకుల నిమిత్తం తెలంగాణ పర్యాటక శాఖ 16 కాటేజీలు, రెస్టారెంట్లను అందుబాటులోకి తెచ్చింది. యునెస్కో గుర్తింపు పొందడంతో.. విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. విదేశీ పర్యాటకుల నిమిత్తం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ కార్యక్రమాలు, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రామప్పకు సమీపంలో ఉన్న కట్టడాలను, చూడదగ్గ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురాతన కట్టడాలకు ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో రూ. 7 కోట్లతో వసతి గృహాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రారంభానికి చివరి దశలో ఉన్నాయి