Home తెలంగాణ సామాజిక రుగ్మతలకు వైజ్ఞానిక దృక్పధమే ఔషధం వైజ్ఞానిక సమాజ నిర్మాణానికి సృజనాత్మక చదువులే...

సామాజిక రుగ్మతలకు వైజ్ఞానిక దృక్పధమే ఔషధం వైజ్ఞానిక సమాజ నిర్మాణానికి సృజనాత్మక చదువులే కీలకం చదివిన చదువులు నిత్యజీవితంలో ఆచరించబడాలి నర్రా రామారావు జె వి వి జాతీయ ఉపాధ్యక్షులు

143
0

జగిత్యాల
జగిత్యాల పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల మరియు శ్రీనిధి ఒలంపియాడ్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఆధ్వర్యంలో  కళాశాల విద్యార్థులకు “విద్యార్థులు – సైన్సు – సమాజం” మరియు పాఠశాల విద్యార్థులకు “శాస్త్రీయదృక్పదం, సరిగా చూడడం ఎలా? ” అనే సబ్జెక్టు లపై రెండు సెషన్ల అవగాహన శిక్షణా తరగతులు నిర్వహించుటలో భాగంగా ముఖ్య అతిధిగా వేదిక జాతీయ ఉపాధ్యక్షులు,నిజామాబాద్ జిల్లా సర్వశిక్షా అభియాన్  అకాడమిక్ ఆఫీసర్  మరియు జాతీయ ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత వక్త నర్రా రామారావు, అతిధులుగా జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ నాగరాజ్ గౌడ్ ఉప్పునూతుల,జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఆముద లింగారెడ్డి,జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఏనగంటి రాజేశం, జె వి వి నిజామాబాద్  జిల్లా ప్రధాన కార్యదర్శి జి గంగాధర్ మరియు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు ద్యావనపల్లి సత్యనారాయణ లు హాజరై అవగాహన శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమానికి  విద్యాసంస్థల  ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ ముసిపట్ల రాజేందర్ అధ్యక్షత వహించగా వక్త నర్రా రామారావు విద్యార్థులకు రెండు సెషన్లలో శిక్షణా తరగతులు నిర్వహించారు.రామారావు   మాట్లాడుతూ సమాజంలో భావితరాల్లో ప్రకృతి, సమాజం,మానసిక అంశాలపై భౌతిక,వైజ్ఞానిక పరమైన నిరూపణకు నిలబడే వైజ్ఞానిక సూత్రాలను నిత్యజీవితంలో ఆచరింపజేసిన నాడే మెరుగైన భావాలు గల ఉత్తమ పౌరసమాజ నిర్మాణం ఆవిర్భావం జరుగుతుందని జె వి వి ఏరాజకీయ పార్టీకి అనుబంధం కాదని సమాజంలో పేరుకుపోయిన కుల,మత,ప్రాంత,వర్ణ,లింగ వివక్షలకు మూఢనమ్మకాలకు,ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని జరుగుతున్న దోపిడీలకు నేరాలకు మోసాలకు అనేకానేక సామాజిక రుగ్మతలకు జాడ్యాలకు ప్రజల్లో లోపించిన శాస్త్రీయదృక్పదం ప్రధాన కారణం ఆయన అన్నారు. సమాజంలో భావితరాలలో పాఠశాల స్థాయి నుండే రాజ్యాంగం ఆర్టికల్ 51 ఏ (హెచ్) ద్వారా శాస్త్రీయ దృక్పధం పెంపొందిస్తే జాడ్యాలకు వివక్షలకు మోసాలు దోపిడీలకు తెరదించవచ్చని అభిప్రాయపడ్డారు.జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ నాగరాజ్ గౌడ్ ఉప్పునూతుల మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన వారే మూఢనమ్మకాలను ఆచరించడం మోసకారుల ఉచ్చులో పడి ధన,మాన, ప్రాణాలు నష్టపోవడం మనం సమాజంలో చూస్తున్నామని అన్నారు.జాతీయ కార్యదర్శి ,తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఆముద లింగారెడ్డి మాట్లాడుతూ మూసపద్దతిలో సర్టిఫికెట్ ల కోసం కేవలం ఉపాధికోసం మాత్రమే చదివిన చదువుల ఫలితంగా విద్యావంతులు కూడా మూఢనమ్మకాలను ఆశ్రయిస్తున్నారని అశాస్త్రీయ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో వివక్షలు, అసమానతలు పోయి మోసాలు నేరాలు తగ్గాలంటే భావితరాల్లో సృజనాత్మక చదువులే కీలకమని అవి  నిత్యజీవితంలో ఆచరించబడాలని పేర్కొన్నారు. ఈ అవగాహన తరగతుల్లో కళాశాల,పాఠశాల అధ్యాపకులతో పాటు విద్యాసంస్థల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Previous articleసూపర్ స్టార్ రజినీకాంత్ `పెద్దన్న` టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
Next articleజిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.నిశ్చల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here