Home తెలంగాణ ఖని లో మెగా రక్తదాన శిబిరం

ఖని లో మెగా రక్తదాన శిబిరం

154
0

పెద్దపల్లి  అక్టోబర్ 20
పోలీస్ ఫ్లాగ్ డే, పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్బంగా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా బుధవారం గోదావరిఖనిలోని ఆర్. సి. ఓ క్లబ్ లో కమిషనరేట్ ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్, గోదావరిఖని సబ్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పెద్దపల్లి డీసీపీ రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీలు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నివాళి అర్పిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ, వివిధ స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు, పోలీసు హితుల సమన్వయంతో పది రోజులపాటూ  సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. తోటివారి ప్రాణాలను కాపాడగలిగే రక్తదానం, దాతను దైవంగా మార్చుతుందని, జిల్లాలోని రక్త నిధి కేంద్రాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. గత కొన్నేళ్లుగా యువత, ప్రజలు రక్తదాన కార్యక్రమాలలో చురుకుగా ఉండడం ఎంతో అభినందనీయమని అన్నారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది యువతతో కలిసి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో పోలీసులతో పాటుగా పట్టణంలోని వివిధ కాలనీల యువత, కాలేజీ విద్యార్థులు పాల్గొని యూనిట్ల రక్తదానం చేయడం పట్ల  పోలీసు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ గోదావరిఖని గిరి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ బాల రాజ్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఇన్స్పెక్టర్లు రమేస్ బాబు, రాజ్ కుమార్, సతీష్, శ్రీనివాస్ రావు, లక్ష్మి నారాయణ, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, ఎస్ఐ,లు ఆర్ఎస్ఐ లు రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్, అధికారులు, సిబ్బంది, వివిధ కాలనీల యువత పాల్గొన్నారు.

Previous articleబీజేపీ పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
Next articleఆర్జి 1 ఏరియాలో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here