మందమర్రి. సెప్టెంబర్ 21
మందమర్రి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజి ఎమ్మెల్సీ, ఏఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక సి ఈ ఆర్ క్లబ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు నూకల రమేష్ లు మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు పేదల పాలిటి పెన్నిధి అని కాంగ్రెస్ కార్యకర్తలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారి సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు. చెన్నూరు నియోజకవర్గం లో ప్రేమ్ సాగర్ రావు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరుస్తామని వారు తెలిపారు.ఆయన వేసవికాలంలో మంచినీటి సదుపాయం తో పాటు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించారని కోవిడ్ సమయంలో సైతం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన గొప్ప నాయకుడు అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కడారి జీవన్ కుమార్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండీ ముజాహిద్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, క్యాతన్పల్లి పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, చెన్నూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సట్ల సంతోష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్ష గడ్డం రజినీ, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనూష రాద, పట్టణ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నెరువెట్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఏటూరు సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ నాయకులు సునార్కర్ రాంబాబు, నవీన్ చంద్ర, కనకం రాజు, బలీద ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.