జగిత్యాల, 22 అక్టోబర్
ఈనెల 28 వ తేదీన 10 గంటలకు పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా లీడ్ బ్యాంక్ (యూబీఐ ) ఆధ్వర్యంలో మెగా రుణ మేళా నిర్వహించనున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్న వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మెగా రుణ మేళా కు సంబంధించిన గోడ పత్రిక (వాల్ పోస్టర్లు) ని జిల్లా కలెక్టర్ జి. రవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెగా రుణ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి. రవి ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ రుణ మేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ముద్ర, స్వానిధి, స్టాండప్ ఇండియా, అగ్రి,
పీఎంఈజీపీ ,పీఎంఎఫ్ఎంఈ ,ఎంఎస్ఎంఈ, రుణాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ మెగా రుణ మేళా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.