Home వార్తలు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ విడుదల..స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవర్...

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ విడుదల..స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవర్ .. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24 సినిమా రిలీజ్‌

194
0

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సోమవారం మూవీ టీజర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే… మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ దీనికి వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న విష‌యం..
‘‘ప్ర‌తి ఒక్క‌డి క‌థ‌లో క‌ష్టాలు క‌న్నీళ్లు ఉంటాయి.
కోరిక‌లుంటాయి.. కోపాలుంటాయి..కనపడితే గొడవలుంటాయి
అలాగే ఇక్క‌డున్న ప్ర‌తి ఒక్క‌డికీ చాంపియ‌న్ అయిపోవాల‌న్న ఆశ ఉంటుంది
కానీ విజేతగా నిలిచేది ఒక్క‌డే..
ఆ ఒక్కడు నువ్వే ఎందుక‌వ్వాలి.. వై యు..
ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావు.
కానీ గెలిస్తే మాత్ర‌మే చ‌రిత్ర‌లో ఉంటావు’’
అంటూ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ లుక్‌కి రామ్ చ‌ర‌ణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అలాగే గని చిత్రాన్ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.
ఈ సంద‌ర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ  ‘‘డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపించే హీరో వ‌రుణ్ తేజ్‌గారు బాక్సింగ్ నేప‌థ్యం ఈ మూవీ కోసం చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు. ఆయ‌న లుక్‌ను చూస్తే ఆయ‌న ప‌డ్డ క‌ష్ట‌మేంటో తెలుస్తుంది. క్యారెక్ట‌ర్‌లో ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం విదేశాల‌కు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.  బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
నటీనటులు: వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

Previous articleనంద్యాల మండలం లోని జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి నంద్యాల డివిజినల్ డెవలప్మెంట్ అధికారి భాస్కర్
Next articleఎమ్మెల్సీ బరిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్! పదవికి రాజీనామా..సీఎస్ ఆమోదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here