Home వార్తలు మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర ‘భోళా శంకర్’లో హీరోయిన్‌గా తమన్నా

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర ‘భోళా శంకర్’లో హీరోయిన్‌గా తమన్నా

122
0

మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌‌లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు నిర్వహించనున్నారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సైరా నరసింహారెడ్డి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. ఇక తమన్నా, చిరంజీవి కలిసి డ్యాన్స్ చేస్తే అభిమానులకు కన్నుల పండుగలా ఉంటుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో  మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
చిరంజీవి మీద లుక్ టెస్ట్ చేశామని సోమవారం సోషల్ మీడియా ద్వారా మెహర్ రమేష్ ప్రకటించారు. యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   ఈ చిత్రానికి అద్బుతమైన నటీనటులు, సాంకేతిక బృందం పని చేయబోతోన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను వెల్లడించనున్నారు.
2022లో భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్

Previous articleనీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి
Next articleనో యాక్సిడెంట్ డే’ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న తూ.గో జిల్లా పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here