మెట్ పెల్లి అక్టోబర్ 08
డిఎస్పీ స్థాయి ఆఫీసర్ల బదిలీల్లో భాగంగా మెట్ పెల్లి డీఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న గౌస్ బాబా వారం రోజుల క్రితం హైదరాబాద్ డిజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కాగా ,ఆయన స్థానంలో నూతన డీఎస్పీ గా అవినీతి నిరోధక శాఖ లో పని చేస్తున్న వంగ రవీందర్ రెడ్డి ని మెట్ పెల్లి డీఎస్పీ గా నియమించారు. ఈమేరకు ఆయన శుక్రవారంనాడు రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా విధులలో చేరిన రవీందర్ రెడ్డి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమెక్కను అందజేశారు.