రంగారెడ్డి
రాజేంద్రనగర్ పోలిస్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అర్దరాత్రి రోడ్డు ప్రమాదం వ్యక్తికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోలింగ్ పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. శంషాబాద్ వైపు నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న డిసియం వ్యాన్ అదే డైరక్షన్ లో వెళుతున్న మరో కారును డికొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోలింగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ కారు డ్రైవర్ ను హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరగడంతో డిసియం డ్రైవర్ అక్కడ నుండి పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.