నంద్యాల
నంద్యాల పట్టణంలో శుక్రవారం నాడు భూమ బ్రహ్మానందరెడ్డి ఇంటి వద్ద గోసుపాడు మండలం రాయపాడు గ్రామానికి చెందిన వైసిపి పార్టీని వీడి టిడిపి పార్టీలో చేరిన వైసిపి నాయకులు యాసం మహేశ్వర రెడ్డి, బాల లింగమయ్య, రమణ, సీలయ్య, సమ్యూల్, సుబ్బారావు, మధు కృష్ణ మరియు గ్రామ ప్రజలకు టీడీపీ పార్టీ లో చేరిక వారికి కండువా వేసి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వైయస్ ఆర్ సీపీ పార్టీ విధి విధానాలు నచ్చక వారు తెలుగుదేశం పార్టీలోకి చేరారని తెలిపారు. ఇంకా చాలా మంది తెలుగు దేశం పార్టీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది ఆయన అన్నారు. ఏది ఏమైనా నంద్యాల లో 2024 సంవత్సరంలో తెలుగుదేశం జెండా ఎగురవేయడం తద్య మని ఆయన అన్నారు.