Home ఆంధ్రప్రదేశ్ పాల సేకరణ పెంచాలి

పాల సేకరణ పెంచాలి

227
0

ఏలూరు,
బి యం సి యు లు ,డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాలు   వేగవంతం చెయ్యాలని    జిల్లా కలెక్టర్   కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.   మంగళవారం కలెక్టర్ క్యాంపు  కార్యాలయంలో   బి యం సి యు లు , డిజిటల్ లైబ్రరీ లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం,  పెన్షన్ల పంపిణీ , జగన్నన్న తోడు , అమూల్ ప్రాజెక్టు , జలజీవన్ మిషన్, ఉపాధి హామీ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది హాజరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా  సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  బి యం సి యు లు, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతంగా జరగాలన్నారు.  జగన్నన్న తోడు ,ఉన్నతి పధకాలకు సంబంధించి  రికవరి  పెరగాలన్నారు. అమూల్  ప్రాజెక్టు లో పాలసేకరణ పెంచాలన్నారు.  జలజీవన్ మిషన్ క్రింద పనులు వేగవంతంగా జరిగేలా  చూడాలని ఆదేశించారు. పనులవారిగా ,కాంట్రాక్టర్ వారి గా సమీక్షించాలన్నారు.ఆయిల్ ఫామ్  ప్లాంటేషన్ నిర్దేశించిన మండలాల్లో పూర్తి చేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ దశలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.   గ్రామ ,వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ 95 శాతం పైగా నమోదు కావాలన్నారు.  గ్రామ, వార్డు వలంటీర్ ల హాజరు 90 శాతం ఉండాదన్నారు.

Previous articleపారని కేసిఆర్ దళితబంధు పాచిక దళితబంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనే టీఆర్ఎస్‌కు ఆదరణ కరువు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ స్వగ్రామంలో ఈటలకు 135 ఓట్ల ఆధిక్యం ఇక దళితబందుకుకు మేఘాలు కమ్ముకుంటాయా?
Next articleధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పాల్గోన్న జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here