హైదరాబాద్
మిలీయన్ మార్చ్‌ను బీజేపీ నేతలు వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ 16న బీజేపీ మిలియన్ మార్చ్ తలపెట్టింది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయి వరకు మిలియన్ మార్చ్‌కు క్యాడర్ సిద్దమైంది. తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలో ప్రకటిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.మరోవైపు శనివారం సాయంత్రం బీజేపీ నేతల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, రాజాసింగ్, జితేందర్‌రెడ్డి, వివేక్, తదితరులు హాజరుకానున్నారు. నేతల మధ్య విభేదాలు, సంధి చర్చలు, నేతలను ఒకే తాటిపైకి తేవడానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. కలిసి ఉంటేనే టీఆర్ఎస్‌ను ఎదుర్కోగలమనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఆపరేషన్ ఆకర్ష్, చేరికలపై కూడా బీజేపీ నేతలు చర్చించనున్నారు.