కడప, నవంబర్ 24
జిల్లా ఇంచార్జి మంత్రి డా. ఆదిమూలపు సురేష్ సంబందిత శాఖల అధికారులతో కలిసి.. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధిత గ్రామాలను, పంట పొలాలను బుధవారం పరిశీలించారు.
రాజంపేట మండల మోరమీద పల్లె, తోగూరిపేట గ్రామలలో వరద నష్టాన్ని పరిశీలించారు. ఇల్లిల్లూ తిరిగి.. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్పునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఇళ్లలో పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా ఫైర్ సిబ్బంది పనిముట్లతో శుభ్రం చేశారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పాక్షికంగా నష్టపోయిన వారికి ఆర్ధిక సాయం, ప్రాణాలు కొల్పియిన కుటుంబాలకు.. ఎక్స్ గ్రేషియా తో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ప్రభుత్వం కల్పించనుందన్నారు.
అనంతరం.. రాజంపేట మండల మోరమీద పల్లె, తోగూరిపేట, రాచపల్లె, రామచంద్రాపురం, నందలూరు మండల పరిధిలోని పాటూరు గ్రామాల పరిధిలో నష్టపోయిన మామిడి, జామ పంటలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరుగుతోందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు.. ప్రభుత్వం సాయం అందిస్తుందని, తప్పకుండా ఆదుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
* అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి ..:
అనంతరం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జెడ్పి ఛైర్మెన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలతో కలిసి.. మంత్రి దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు.
ప్రాజెక్టు మట్టికట్టలు కొట్టుకుపోవడానికి కారణాలను ఆడిగి తెలుసుకున్నారు. శాఖల వారీగా జరిగిన వరద నష్టాన్ని, యుద్ధప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ చర్యల వివరాలను సంబందిత శాఖల అధికారులు మంత్రికి తెలియజేసారు