నెల్లూరు నవంబర్ 19
శాససనభలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్ధ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘనవిజయం సాధించినందుకు వారిని పార్టీ నేతలను జగన్ అభినందించారు. అనంతరం రాజకీయ పరిణామాలపై పూర్తిగా విశ్లేషించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలలో వైకాపా విజయం సాధించే దిశగా ముందడుగు వేయాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.