కడప నవంబర్29
కడప లో అహోబిల మెడికల్స్ ఏర్పాటు చేసి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా ఆనందరెడ్డి ని ఉపముఖ్యమంత్రి ఎస్ బి. అంజాన్ భాష, కడప నగర మేయర్ సురేష్ బాబు లు అభినందించారు. సోమవారం కడప నగరంలోని ఎస్ ఎఫ్ ఎస్ వీధిలో, సెవెన్ రోడ్స్ సర్కిల్లో అహోబిల మెడికల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువు చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన ఆనంద్ రెడ్డి ఇప్పుడు కడపలో అహోబిల మెడికల్ షాప్ ను ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు కల్పించడం మెచ్చుకో దగ్గ విషయమన్నారు. అహోబిల మెడికల్స్ ప్రొప్రైటర్ ఆనంద్ రెడ్డి, కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ బ్రాండెడ్ మెడికల్ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. డాక్టర్ సలహా మేరకు అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా కారణంగా ఇబ్బంది పడిన వారికి కావాల్సిన బ్రాండెడ్ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు డిస్కౌంట్ సౌకర్యం కలదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు షఫీ, సుబ్బారెడ్డి, కాంట్రాక్టర్ వి. గంగిరెడ్డి, చంద్రబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.