నెల్లూరు నవంబర్ 23
నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతిని రాష్ట్ర అటవీ, విద్యుత్ మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డిని అభినందించారు. తొలుత రాష్ట్ర అటవీ, విద్యుత్ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా నియమితులైన నెల్లూరు మేయర్ పోట్లూరు స్రవంతిని రాష్ట్ర అటవీ, విద్యుత్ మరియు జిల్లా ఇంఛార్జ్ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు మిద్దె మురళీ కృష్ణా యాదవ్, 19వ డివిజన్ అభివృద్ధి కమిటీ ఛైర్మెన్ మదన్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు చింతా ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.