మెదక్ నవంబర్ 30
జిల్లాలోని శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన హోమం కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొత్తగా నిర్మిస్తున్న శ్రీ సీతా రాముల వారి దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.