జగిత్యాల నవంబర్ 11
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపురంకు చెందిన బ్రహ్మయ్య కుమారుడు శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి తన ఆర్థిక పరిస్థితిని వివరించారు. దాంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు శ్రీనివాస్ దరఖాస్తును పంపగా మెరుగైన వైద్య సేవల కోసం రూ. 4 లక్షల రూపాయల ఎల్ వో సి మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పత్రాన్ని వారికి అందించారు. ఆర్థిక సాయం అందించినందుకు ప్రభుత్వానికి, కృషి చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఈ సందర్భంగా బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.