నెల్లూరు
నెల్లూరు జిల్లా
ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా వచ్చిన ప్రజల నుంచి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా
నియోజకవర్గ అభివృద్ధే అజెండాగా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సంక్షేమ పథకాల అమలు గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు.
గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సచివాలయాలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ తదితర భవన నిర్మాణాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రెవెన్యూ శాఖతో ముడిపడని, ప్రజల సమస్యలకు అప్పటికప్పుడే అక్కడికక్కడే సంబంధిత అధికారులతో, స్థానిక నాయకుల సమన్వయంతో ఆయా సమస్యలను పరిష్కరించారు.
రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతసాగరం మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ఆ మండల ఎమ్ఆర్ఓకి మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో శ్రీనివాసులు రెడ్డి అనంతసాగరం మండల రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని, స్థానిక ప్రజలు మరియు బాధితులు మంత్రి మేకపాటి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని వివిధ శాఖల అధికారులు, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు